ఇంకో వారం రోజుల్లో జనవరి నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల ప్రారంభం కాబోతున్నది. కాగా ప్రతి నెల మదిరిగానే వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరీ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి నెల 28 రోజుల్లో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, పండగలు, నేషనల్ హాలిడేస్ అన్నీ కలుపుకుని మొత్తం 14 రోజులు బ్యాంకు సెలవులున్నాయి.
ఫిబ్రవరి నెలలో సరస్వతీ పూజ, తైపూసం, గురు రవిదాస్ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, మహాశివరాత్రి వంటి అనేక పండుగలు ఉన్నాయి. ఏయే తేదీల్లో బ్యాంకు సెలవులు ఉంటాయో ముందే తెలుసుకుంటే దానికి అనుగుణంగా మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని గమనించాలి. బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ, ఇతర డిజిటల్ సేవలను ఉపయోగించుకుని ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే!
ఫిబ్రవరి 02, ఆదివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 03, సోమవారం – సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 08, శనివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 09, ఆదివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 11, మంగళవారం – థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 12, బుధవారం – శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 15, శనివారం – ఇంఫాల్‌లో Lui-Ngai-Ni సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 16, ఆదివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 19, బుధవారం – ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలిడే
ఫిబ్రవరి 20, గురువారం – మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 22, శనివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 23, ఆదివారం – దేశ వ్యాప్తంగా సెలవు
ఫిబ్రవరి 26, బుధవారం – మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 28, శుక్రవారం – లోసార్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.