స్నేహం అనే పదానికి మాయని మచ్చను తీసుకువచ్చారు ఇద్దరు కామాంధులు. పార్టీ పేరుతో స్నేహితురాలిని ఇంటికి పిలిచి బలవంతంగా మద్యం తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌లో నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులు అమల్ (21), అంబడి (19) బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని డిప్రెషన్‌తో బాధపడుతోందని కళాశాల యాజమాన్యం గుర్తించి ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కోజికోడ్‌లో శనివారం రాత్రి నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Also Read : Breaking : జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం
సదరు యువతి ఫిర్యాదు ప్రకారం.. వారు ఆమెను బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత వారు ఆమెపై అత్యాచారం చేశారు. విద్యార్థి డిప్రెషన్‌లో ఉండటంతో గుర్తించి కళాశాల యాజమాన్యం కౌన్సింగ్ ఇవ్వడంతో.. ఈ విషయాన్ని వెళ్లడించింది. దీంతో కోజికోడ్‌లోని కసాబా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఇద్దరు నిందితులు తమ అద్దె ఇంటికి పార్టీ పేరుతో ఆహ్వానించారు.
Also Read : IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్..
నర్సింగ్ విద్యార్థినిని బలవంతంగా మద్యం తాగించి, మత్తులో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నర్సింగ్ విద్యార్థినిని ఇంట్లో ఒంటరిగా వదిలి నిందితులు పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన తరువాత, విద్యార్థి తన స్నేహితురాలికి సమాచారం ఫోన్ చేసి అక్కడి నుంచి బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళలో కలకలం రేపింది.