Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*అంతా చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే..
అంగళ్ళులో తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధం అంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేయడం ద్వారా తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పదలుచుకున్నారని ఆయన విమర్శించారు. అంగళ్ళులో ఏమి జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు చేసిన నేరం ఎలాంటిదో మరోసారి చూడాలన్నారు. చంద్రబాబు సైగలు చేస్తూ తరమండి అని చెప్పడంతో టీడీపీ అరాచక శక్తులు వైసీపీ సానుభూతి పరులపై దాడి చేశారని.. చంద్రబాబు భాషా, రెచ్చగొట్టే విధానం వల్లే గొడవ జరిగిందన్నారు. చంద్రబాబుకు పోలీసులు అంటే చులకన అంటూ ఆయన మండిపడ్డారు. దాడి జరిగే పరిస్థితి ఉంటే నాయకుడు అనే వాడు అవుతాడా? రెచ్చగొడతారా అంటూ సజ్జల మండిపడ్డారు. తాను కోరుకున్నది జరుగుతున్నదని చంద్రబాబు మొహంలో వికృత ఆనందం కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రీ ప్లాన్డ్ గా అరాచక, ఉగ్రవాద ముఠాగా దాడులు చేశారని.. ఇలాంటి వాళ్ళు కార్యకర్తలా…. వాళ్ళకి నాయకుడని చెప్పుకోడానికి చంద్రబాబుకి సిగ్గుండాలన్నారు.
చంద్రబాబు దేనికి ఇదంతా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులని బయలుదేరటం ఏంటి… చేసింది ఏంటన్నారు. తూ తూ మంత్రంగా రెండు చోట్ల కు వెళ్ళి సెల్ఫీలు దిగాడని సజ్జల విమర్శించారు. చాలా నిగ్రహంగా ఉన్నా పోలీసులనూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని చంద్రబాబుపై సజ్జల మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో ఏమీ చేయలేనని తనకు అర్థం అయ్యిందని.. అందుకే ఏదో ఒక అరాచకం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏ విషయంలోనూ వివక్షకు తావు లేకుండానే చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రిని చిరంజీవి గతంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పారని.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావటం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టికెట్ల విషయంలో ఇటు ప్రజలు, అటు సినీ పరిశ్రమ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయత్నం చేస్తే మంచిదన్నారు. అప్పుడు ఆ క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకోవచ్చని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యలకు ప్రతిస్పందన ఉండకుండా ఎలా ఉంటుందన్నారు. చట్టం ప్రకారం ఏం చేయాలో అన్నీ జరుగుతాయన్నారు. దాడుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గానే పరిగణిస్తుందని.. నేను సీనియర్‌ని, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చట్టంలో కుదరదన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

 

*మహిళను వివస్త్రను చేసిన ఘటనపై గవర్నర్ సీరియస్
హైదరాబాద్ జవహార్‌నగర్‌ పీఎస్ పరిధి‌లోని బాలాజీనగర్ లో ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి.. చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను గవర్నర్ ఆదేశించారు. మద్యం మత్తులో ఓ కామాంధుడు యువతిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ నెల 6న హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పరిధిలోని బాలాజీనగర్ బస్టాప్ లో నిల్చుని ఉంది. ఈ క్రమంలో మారయ్య అనే వ్యక్తి ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఆ యువతి అతనిని దూరంగా నెట్టేసింది. దీంతో ఆ కీచకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె బట్టలను చించి లాగేశాడు. ఆమె దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా పడివున్నా పట్టించుకున్న వారు లేరు. అంతా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ కేసులో నిందితుడు మారయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడు చేసిన పనికి సహకరించిన తల్లి నాగమ్మను సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

 

*విపక్షాలకు అమిత్‌ షా కౌంటర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా ప్రసంగిస్తూ మణిపూర్‌ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తూనే.. విపక్షాలకు కౌంటర్‌ ఇచ్చాడు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తూ.. రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకొచ్చాయని మండిపడ్డారు. ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదని .. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. చర్చకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుందని అన్నారు. ప్రజలకు అంతా తెలుసునని.. వాళ్లు అంతా చూస్తున్నారని చెప్పిన అమిత్‌ షా.. ప్రజలకు తమపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్‌ వీడియో గురించీ ప్రస్తావిస్తూ ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్‌ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్‌ అయ్యిందని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారని విమర్శించారు. తానే స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్‌ వెళ్లానని.. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని తానేనని… మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారని చెప్పారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం… త్వరలోనే మణిపూర్‌ పరిస్థితులను అదుపులోకి తెస్తామని హోం మంత్రి లోక్‌సభలో చెప్పారు. మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు బాధాకరమని.. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని తామూ అంగీకరిస్తున్నామని అమిత్‌ షా తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనంతరమే మణిపూర్‌లో హింస ప్రారంభం అయిందని.. మే 3వ తేదీన మొదలైన మణిపూర్‌ హింస నేటికీ కొనసాగుతోందని.. మణిపూర్‌ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని అమిత్‌ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ది కరప్షన్‌ క్యారెక్టర్‌ అని.. కానీ బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ అని చెప్పారు. వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుందన్నారు. మేకిన్‌ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్‌ గాంధీతోపాటు అఖిలేష్‌ యాదవ్‌ కూడా తప్పుబట్టారని గుర్తు చేశారు. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్‌ షా చురకలంటించారు. నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారని.. డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉందని గుర్తు చేసిన అమిత్‌ షా.. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం కాబట్టే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయిందన్నారు.

 

*రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపిన అరవింద్‌ కేజ్రీవాల్‌
కాంగ్రెస్‌ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకి కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభతోపాటు, రాజ్యసభలోనూ వ్యతిరేకంగా ఓటు వేసినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు అరవింద్‌ కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలుపుతూ .. రాహుల్‌ గాంధీని ప్రశంసిస్తూ.. ఆయనకు లేఖ కూడా రాశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ తన లేఖలో ఢిల్లీ సర్వీసుల బిల్లును తిరస్కరించి.. వ్యతిరేకంగా ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ ఇచ్చిన మద్దతుకు ఢిల్లీలోని కోట్లాది ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ.. మీకు ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఢిల్లీ ప్రజల హక్కుల కోసం పార్లమెంటులో ఎంతో పోరాడుతున్నారని.. రాజ్యాంగం పట్ల మీకున్న విధేయత దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని.. రాజ్యాంగాన్ని అణగదొక్కే వారికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని లేఖలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ జాతీయ పార్టీలతోపాటు.. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతీయ పార్టీలను అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్ధతు కోరిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఈ బిల్లు పొందిన తరువాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు కాస్త చట్టంగా మారిపోతుంది.

 

*బీజేపీపై రాహుల్‌ ఫైర్
గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదీవాసీలు దేశానికి యజమానులని తాము నమ్ముతున్నామని.. భూమిపై వారికి హక్కుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదీవాసీల నుండి భూములను లాక్కొని అదానీకి అప్పగిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని రాహుల్‌ గుర్తు చేశారు. తాము హక్కులు కల్పిస్తే బీజేపీ వాటిని రద్దు చేసిందని రాహుల్‌ విమర్శించారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్ రాష్ట్రంలోని మాన్‌గర్ థామ్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పుణ్యభూమికి అందరికి స్వాగతం అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాన్‌గర్‌ధామ్ లో బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన నానమ్మ ఇందిరా గాంధీ బాల్యంలో తనకు ఇచ్చిన పుస్తకం గురించి రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.ఈ పుస్తకం తనకు ఎంతో నచ్చిన పుస్తకంగా ఆయన పేర్కొన్నారు. తాను మీ సైనికుడినని.. ఢిల్లీలో ఉంటానని రాహుల్ చెప్పారు. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ కు పిలవొచ్చని రాహుల్ గాంధీ గిరిజనులను కోరారు. ఆధునిక సమాజం గిరిజనుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం పూర్వం ఆదివాసీల భూమి అని గుర్తు చేశారు. గిరిజనుల పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారో అది నిజం కావాలని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. గిరిజనులు అడవిలోనే ఉండాలని మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావొద్దని బీజేపీ కోరుకుంటుందని విమర్శించారు. మణిపూర్ లో బీజేపీ భరతమాతను హత్యచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యాన్ని దింపి గొడవలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. తాను పార్లమెంట్ లో కూడ ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. పేద ప్రజల కోసం రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని.. కేవలం పెన్షన్ పథకం ద్వారానే 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని రాహుల్‌ గాంధీ తెలిపారు.

 

*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదీవాసీలు దేశానికి యజమానులని తాము నమ్ముతున్నామని.. భూమిపై వారికి హక్కుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదీవాసీల నుండి భూములను లాక్కొని అదానీకి అప్పగిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని రాహుల్‌ గుర్తు చేశారు. తాము హక్కులు కల్పిస్తే బీజేపీ వాటిని రద్దు చేసిందని రాహుల్‌ విమర్శించారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజస్థాన్ రాష్ట్రంలోని మాన్‌గర్ థామ్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పుణ్యభూమికి అందరికి స్వాగతం అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మాన్‌గర్‌ధామ్ లో బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన గిరిజన సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన నానమ్మ ఇందిరా గాంధీ బాల్యంలో తనకు ఇచ్చిన పుస్తకం గురించి రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.ఈ పుస్తకం తనకు ఎంతో నచ్చిన పుస్తకంగా ఆయన పేర్కొన్నారు. తాను మీ సైనికుడినని.. ఢిల్లీలో ఉంటానని రాహుల్ చెప్పారు. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ కు పిలవొచ్చని రాహుల్ గాంధీ గిరిజనులను కోరారు. ఆధునిక సమాజం గిరిజనుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. భారతదేశం పూర్వం ఆదివాసీల భూమి అని గుర్తు చేశారు. గిరిజనుల పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారో అది నిజం కావాలని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. గిరిజనులు అడవిలోనే ఉండాలని మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావొద్దని బీజేపీ కోరుకుంటుందని విమర్శించారు. మణిపూర్ లో బీజేపీ భరతమాతను హత్యచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సైన్యాన్ని దింపి గొడవలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. మణిపూర్‌లో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. తాను పార్లమెంట్ లో కూడ ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. పేద ప్రజల కోసం రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని.. కేవలం పెన్షన్ పథకం ద్వారానే 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని రాహుల్‌ గాంధీ తెలిపారు.

 

*బోళా శంకర్‌కు షాక్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. షాడో లాంటి డిజాస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా రేట్లు పెంచి అమ్ముకుంటామని సినిమా నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 25 రూపాయల మేర పెంచుకుని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆ అనుమతులు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం చిరంజీవి మీద విరుచుకుబడింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక రేంజ్ లో ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పెంపు అసాధ్యం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా పెంపు ప్రపోజల్ను ప్రభుత్వం తిరస్కరించిందని ప్రచారం జరుగుతోంది. నిజానికి భోళా టీం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డాక్యుమెంట్లు సమర్పించాలని భోళా శంకర్ టీం కి చెప్పామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిజంగా సినిమా టికెట్ రేటు పెంపుదల ప్రపోజల్ను ప్రభుత్వం తోసిపొచ్చిందా? లేక అది ప్రచారమేనా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద అధికారులు అధికారికంగా ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.

 

*సినిమా రిలీజ్ పెట్టుకుని హిమాలయాలకి వెళ్లిన సూపర్ స్టార్..
రజనీకాంత్​.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్​ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్​ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్​ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా “వా నువ్వు కావాలయ్య” సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. అయితే రేపు విడుదల కానున్న ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అమెరికాలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉండగా రేపు ఈ సినిమా విడుదల పెట్టుకుని సూపర్ స్టార్ రజనీ హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మనశ్శాంతి కోసం తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు.ఎన్ని పనులు వున్నా సూపర్ స్టార్ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్తారు. కానీ కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్ల నుంచి ఆయన హిమాలయాలకు వెళ్లడం లేదు. అందుకే జైలర్ సినిమా విడుదల ఉన్నా సరే హిమాలయాలకు వెళ్లిపోయారు.

Exit mobile version