Rajinikanth Himalayas : సినిమా రిలీజ్ పెట్టుకుని హిమాలయాలకి వెళ్లిన సూపర్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీకాంత్.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా “వా నువ్వు కావాలయ్య” సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది.
అయితే రేపు విడుదల కానున్న ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అమెరికాలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉండగా రేపు ఈ సినిమా విడుదల పెట్టుకుని సూపర్ స్టార్ రజనీ హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మనశ్శాంతి కోసం తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు.ఎన్ని పనులు వున్నా సూపర్ స్టార్ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్తారు. కానీ కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్ల నుంచి ఆయన హిమాలయాలకు వెళ్లడం లేదు. అందుకే జైలర్ సినిమా విడుదల ఉన్నా సరే హిమాలయాలకు వెళ్లిపోయారు.
Also Read
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
- E20 Petrol New Controversy: E20 పెట్రోల్‌పై మరో వివాదం.. ఏకంగా 31.2 శాతం ఇథనాల్! ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!