Child Care Leave: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. శిశు సంరక్షణ సెలవులు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Care Leave: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. శిశు సంరక్షణ సెలవులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై శిశు సంరక్షణ సెలవులను 730కి పెంచింది. భార్యా భర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి పిల్లలను పెంచడం కోసం ఎవరో ఒకరు సెలవు పెట్టుకోవల్సి వస్తుంటుంది. వారికి ప్రభుత్వం మంజూరు చేసే చైల్డ్ కేర్ లీవ్స్ సంఖ్య వరకు ఉపయోగించుకున్న తరువాత అదనంగా కావల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఇద్దరిలో కొద్ది రోజులు ఒకరు సెలవులు పెట్టుకొని పిల్లలను చూసుకుంటే.. మరికొద్ది రోజులు మరొకరు సెలవు పెట్టుకొని పిల్లల సంరక్షణలో కొనసాగాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతోంది. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగులను బయటపడేయడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే శిశు సంరక్షణ సెలవులను పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Read also: Vijay Deverakonda: డిజాస్టర్ లైగర్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్దోగులైతే.. పిల్లల పెంపకంపై ప్రభావం పడుతోందని.. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు, ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒంటరి పురుషుల (సింగిల్ మెన్)కు 730 రోజుల శిశు సంరక్షణ సెలవులకు అర్హులని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. బుధవారం ఆయన పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ , ఇతర పోస్టులకు నియమితులైన మహిళా ప్రభుత్వ ఉద్యోగులు , ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు), 1972లోని 43-C ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ విభాగాలకు చెందిన ఉద్యోగుల మొదటి ఇద్దరు పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకూ సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజుల వ్యవధి.. వికలాంగ పిల్లల విషయంలో వయోపరిమితి లేదని కేంద్ర మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పురుషులు పుట్టిన లేదా దత్తత తీసుకున్న ఆరు నెలలలోపు 15 రోజుల సెలవులకు అర్హులు కాగా.. 2022లో తల్లులపై భారాన్ని తగ్గించేందుకు పితృత్వ సెలవులను పెంచాలని మహిళా ప్యానెల్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే శిశు సంరక్షణ సెలవులపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తల్లిదండ్రుల సెలవు ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ద్వారా అమలు జరుగుతోంది. ఈ చట్టం మేరకు పని చేసే మహిళలు ఆరు నెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తీసుకోవడానికి అనుమతి లభిస్తుంది.
తాజావార్తలు
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!