యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఎంతో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ దేవర సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో దేవర సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. దేవర పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది.
కాగా, దేవర షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.దేవర మూవీ షూటింగ్‍లో ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ 2024 జనవరి మూడో వారంలో పూర్తవుతుందని ఆ సినిమా వర్గాల సమాచారం. గోవా తీర ప్రాంతంలో ఈ మూవీ ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది.. ఎన్టీఆర్ జనవరి మూడో వారంలో దేవర షూటింగ్‍ను పూర్తి చేసుకోనున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించనున్న వార్-2 సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.వార్‌కు సీక్వెల్‍గా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు..అయితే వార్-2 మూవీ షూటింగ్‍లో 2024 మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ పాల్గొననున్నారని తెలుస్తోంది.హృతిక్ రోషన్ వార్-2 మూవీ షూటింగ్‍ను ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నారు.ఎన్టీఆర్ వార్ 2 మూవీ తో పాటు కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ ఓ సినిమా చేయనున్నారు ఈ చిత్ర షూటింగ్ కూడా వచ్చే ఏడాదే మొదలు కానుంది.