పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్లో ఉండగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాను కూడా కెజీయఫ్, సలార్ లాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన ఫస్ట్ సినిమా ఉగ్రం తప్ప ఆ తర్వాత చేసిన కెజియఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించాడు నీల్.
Also Read : SKxARM : మురుగదాస్, శివ కార్తికేయన్ టైటిల్ ఇదే
ఆ తర్వాత వచ్చిన సలార్‌ను కూడా టు పార్ట్స్‌గా ప్రకటించాడు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ అవగా క్లైమాక్స్‌లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేశారు. సలార్ 1 కన్నా భారీగా సలార్ 2 తెరకెక్కించే ప్లానింగ్‌లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను కూడా రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కథ పరిధి ఎక్కువగా ఉండడంతో పాటు సీక్వెల్ సినిమాలు ప్రశాంత్ నీల్‌కు ఓ సెంటిమెంట్‌లా మారింది. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్-నీల్ 2 రావడానికి చాలా సమయం పట్టనుంది. సలార్ 2 తర్వాతే ఈ సినిమా ఉండనుంది. కానీ ఎన్టీఆర్-నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈ లెక్కన అనుకున్న సమయానికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.