తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివ. తన కేరీర్ లో 23వ సినిమాగా రానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుండి కీలక ప్రకటన చేసాడు శివ కార్తికేయన్.
నేడు శివకార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మురుగదాస్ కాంబోలో చేయబోతున్న సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘మదరాసి’ అనే టైటిట్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే మురుగదాస్ గత చిత్రాలు మాదిరి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ‘మదరాసి’లో శివకార్తికేయన్ సరసన కన్నడ భామా రుక్మిణివసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు బిజూ మీనన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జుంజున్ వాల విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై శ్రీ లక్ష్మి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతమే అందిస్తున్నాడు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అనిరుధ్ బీజీఎమ్ సూపర్బ్ వుంది అనే చెప్పాలి. మొత్తానికి శివ కార్తికేయన్, మురుగదాస్ కలిసి మరో తుపాకి లాంటి బ్లాక్ బస్టర్ ను రెడీ చేస్తున్నారని శివ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : KA 10 : దిల్ రూబా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్