‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ పలు వివాదాలకు దారితీసింది. ఇప్పటికే తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజ్‌ను ఉపయోగించారని నటుడు ధనుష్, హీరోయిన్ నయనతారకు లీగల్ నోటీసులు పంపడం. దానికి బదులుగా ధనుష్ క్యారెక్టర్ ను విమర్శిస్తూ నాయనతార ఎక్స్ లో పోస్ట్ పెట్టడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం రేగింది. కేవలం మూడు సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసాడని ధనుష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది నయన్. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. జనవరి 8 లోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నయన్ దంపతులతో పాటు నెట్‌ఫ్లిక్స్ బృందానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read : Oscars 2025 Nominations : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే నయన్ నటించిన చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ తమ సినిమాలో క్లిప్ ను వాడుకుందని అందుకు తమ అనుమతులు తీసుకొలేదని నయన్ కు నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇదంతా ధనుష్ కావాలనే చేపిస్తున్నాడనే న్యూస్ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై చంద్రముఖి చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. నయనతారకు మేము ఎటువంటి నోటీసులు పంపలేదు. తాము రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్నవార్తలు పూర్తిగా ఫేక్. ఆమె తన డాక్యుమెంటరీ కోసం నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయకముందే మా దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారు అని ఆ లెటర్ ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మేకర్స్. అసలు మేము ఎవరికి ఎలాంటి నోటీసులు పంపలేదు అని స్పష్టం చేసారు మేకర్స్.