Fadnavis: వ్యూహం మార్చిన ఫడ్నవీస్.. మహా ఎన్నికలే టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. తక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశం తర్వాత ఫడ్నవీస్.. తన ఆలోచనను మార్చుకున్నారు. రాజీనామాపై అమిత్ షాతో ఫడ్నవీస్ చర్చించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు పలు సూచనలు చేశారు. హస్తినలో చర్చలు తర్వాత రాజీనామాపై ఫడ్నవీస్ ఆలోచన మార్చుకున్నారు. తాజాగా రాజీనామా చేయడం లేదని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ తరఫున ముగ్గురు సీనియరు అధికారులు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలు గెలిస్తే.. తాజా ఫలితాల్లో 9 స్థానాలే గెలుచుకుంది. దీంతో దీనికి బాధ్యత వహిస్తూ ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ అమిత్ షా బుజ్జగింపులతో మెత్తబడ్డారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తానే నాయకత్వం వహించినట్లు తెలిపారు. ఓటమికి కూడా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. రాజీనామాకు అనుమతించాలని కోరాను. కానీ త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పని చేసుకుంటూ సాగిపోవాలని అమిత్ షా చెప్పారన్నారు. తనపై అధిష్టానం విశ్వాసం ఉంచిందని చెప్పుకొచ్చారు. అక్టోబరులో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి.. ముందుకు సాగిపోవాలని అమిత్ షా చెప్పినట్లు ఫడ్నవిస్ పేర్కొన్నారు. అందుకోసమే రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: IBPS RRB 2024: 10వేల ఉద్యోగాలు రెడీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..
మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 17 స్థానాలే గెలుచుకుంది. మిగతా స్థానాలు విపక్ష కూటమి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. కేవలం 2 లక్షల ఓట్ల తేడాతోనే ఈ మార్పు జరగడం విశేషం. విపక్షాల తప్పుడు ప్రచారంతోనే సీట్లు తగ్గాయని ఫడ్నవీస్ ఆరోపించారు. మోడీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న తప్పుడు ప్రచారంతోనే సీట్లు తగ్గాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!