మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం పాత్రలు మాత్రమే మారాయని.. అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగదని తెలిపారు. ముగ్గురం కలిసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును బట్టి మంత్రులను ఎంపిక చేస్తామన్నారు. ఇక డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు…
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజులకి మహారాష్ట్ర సీఎం ఎంపిక పూర్తయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి.
మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. తక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు.