Opposition Alliance: యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. కొత్తగా కలిసిన 15 ప్రతిపక్షాలు కూటమికి కొత్త పేరుపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకి దీటుగా దేశభక్త ప్రజాస్వామిక కూటమి అనే పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయెన్స్-పీడీఏ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల ఐక్యతా సమావేశంలో కొత్త జట్టు పేరును మెజారిటీ పార్టీలు అంగీకరించాయని సమాచారం. పీడీఏ పేరును సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా గట్టిగా సమర్థించినట్టు తెలిసింది. వచ్చే నెలలో సిమ్లాలో జరిగే భేటీలో కొత్తపేరు మీద క్లారిటీ వస్తుందని జాతీయ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీఏ కన్వీనర్‌గా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందు కృషిచేస్తున్న నితీష్ కుమార్.. ఆమె స్థానంలో కూటమికి నేతృత్వం వహిస్తారని కాంగ్రెసేతర విపక్షాలు చెబుతున్నాయి. అయితే యూపీఏ రద్దును కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి.
Read Also: Kurnool Crime: కర్నూల్‌లో మెడికో ఆత్మహత్య..
19 ఏళ్లుగా యూపీయే కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు కొత్త కూటమిలో అంతే గౌరవం దక్కుతుందా.. ఓ ప్రాంతీయ పార్టీ నేత నాయకత్వాన్ని జాతీయ పార్టీ ఆమోదిస్తుందా అనే సందేహంపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. యూపీఏ ఇప్పటికీ ఉనికిలోనే ఉందని, సోనియా సారథిగా వున్నారని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కొత్త కూటమి పేరు పట్నా భేటీలో ప్రస్తావనకు వచ్చి ఉంటే కచ్చితంగా మీడియాకు చెప్పే వాళ్లమని ఆర్‌జేడీ అంటోంది. మరోవైపు విపక్షాల కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరడం ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఆ పార్టీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. రాహుల్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమతో సయోధ్య కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆప్ నాయకత్వానికి అర్థమైంది.
