ఆర్యవైశ్యులపై ఈ ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పొదిలిలో అవినాష్ అనే యువకుడుపై ఎస్ఐ రక్తం వచ్చేలా కొట్టాడని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే ఆయన తండ్రి కోటేశ్వర రావును కొట్టారని మండిపడ్డారు. పొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైశ్యులపై కక్ష్య సాధింపు, పోలీసుల వేధింపులు పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Shambhala vs Champion: బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ.. యంగ్ హీరోల కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!
‘పొదిలి ఎస్ఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు అంతా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. పిడుగురాళ్ళలో జ్యోతి అనే మహిళపై పోలీస్ స్టేషన్లో బలవంతంగా సంతకాలు తీసుకుని వేధించారు. వైశ్యులపై పోలీస్ వేధింపులు పెరిగిపోయాయి. వ్యాపారస్తులకు, ఆర్యవైశ్యలకు భద్రత కల్పించండి. తిరుమలలో పరిపాలన గాడి తప్పింది. తిరుమలలో టీడీపీ నేతలు టికెట్లకే పరిమితం అవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామా అంటే కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పు చేస్తే శిక్షించండి. తప్పుడు కేసులు పెడితే మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు 2.o చర్యలు తప్పవు’ అని మాజీ మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు.