Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News No One Can Restrain Adults From Marrying As Per Their Will Allahabad High Court

Allahabad High Court: లవ్ మ్యారేజీలపై అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు..

Published Date :June 13, 2024 , 2:17 pm
By Chandra Shekhar Pamena
  • మేజర్లు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు..
  • ఓ ప్రేమ పెళ్లి విషయంలో భర్తపై భార్య బంధువులు పెట్టిన కిడ్నాప్ కేసును కొట్టివేసిన న్యాయస్థానం..
  • కుటుంబ సభ్యుల నుంచి భార్యకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు
Allahabad High Court: లవ్ మ్యారేజీలపై అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనియ్యకుండా, ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ ఆపలేరని అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని తెలిపింది. మేజర్లైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా.. భార్య తరపు బంధువులు భర్తపై కిడ్నాప్ కేసు పెట్టడాన్ని న్యాయస్థానం తోసిపుచ్చుతూ ఈ కామెంట్స్ చేసింది. భార్య మేనమామ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా.. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భార్య వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పు బట్టింది.

Read Also: Kishan Reddy: గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు..

కాగా, 21 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తనకు నచ్చిన వ్యక్తిని తమ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చింది. అయితే, భార్య మేనమామ ఐపీసీ సెక్షన్ 363 కింద పెళ్లి కొడుకుపై కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో పాటు భార్యను కూడా అరెస్ట్ చేసి ఆమెను మేనమామకు అప్పగించేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆమెను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. అయితే, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని వాంగ్మూలం ఇచ్చింది. అయిన కూడా పోలీసులు సదరు ముస్లిం యువతిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

Read Also: Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు

దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చినా తనను ఇంటికి పంపించారు.. తనకు ప్రాణహాని ఉందని భార్య తెలపగా.. మేనమామ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. యువతిని చంపుతానన్న ఆమె మేనమామపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పేర్కొనింది. అలాగే, ఆ జంటకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allahabad High Court
  • Article 21
  • Judicial Magistrate
  • No one can restrain
  • telugu news

తాజావార్తలు

  • Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!

  • Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Gen-Z : పచ్చి తాగుబోతులు భయ్యా… ఇవే తగ్గించుకుంటే మంచిది!

  • DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions