Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garapati Divya: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో శోకసంద్రం అలుముకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా గారపాటి దివ్య(28) పోటీ చేశారు. నేడు (శనివారం) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె 350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కానీ.. దివ్య నిన్న (శుక్రవారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జనాధారణతో గెలిచినా.. మృత్యువుతో పోరాడి ఓడారు. ఈ ఘటనతో విజయం సాధించిన ఆనందాన్ని అనుభవించక ముందే ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఇక, డిగ్రీ పూర్తి చేసి, శ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న దివ్యకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన కొద్దిసేపటికే ఆమెకు కడుపునొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిందని ఇంటికి తీసుకొచ్చినప్పటికీ, శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి రాజమహేంద్రవరం తరలిస్తుండగా ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
నిన్న శుక్రవారం ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూస్తే, సరిగ్గా నేడు శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె ఏకంగా 350 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రజల నుంచి అపారమైన మద్దతును గెలుచుకుని, తన వార్డు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువ నాయకురాలు నేడు గెలిచిన వార్తను చూసేందుకు భౌతికంగా లేకపోవడం ఆ గ్రామస్థులను కంటతడి పెట్టిస్తోంది. కన్నతల్లిని కోల్పోయి పసిమొగ్గలు రోదిస్తుంటే, గెలుపు సంతోషం ఉండాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఇక నిన్న దివ్య భౌతికకాయానికి గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు, జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు, కూటమి నాయకులు నివాళులర్పించి, కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.
Also Read
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
- Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
- AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
-
Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..