YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former CM YS Jagan Mohan Reddy: వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గమన్నారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? అని జగన్ ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? అని నిలదీశారు. స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అని జగన్ మండిపడ్డారు.
Also Read
- Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
- WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
- Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
“ఈ స్థానిక ఎన్నికల్లో.. నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు.” అని ట్వీట్లో మాజీ సీఎం జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు