5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Smartphones: పండుగ సీజన్ వచ్చేసింది.. మార్కెట్లలో ఆఫర్ల సందడి మొదలైంది. పాత ఫోన్ మార్చి, లేటెస్ట్ ఫీచర్లతో అదిరిపోయే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ చేతిలోకి తీసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. అయితే బడ్జెట్ రూ. 20 వేల లోపు ఉంచుకుని, ఏ ఫోన్ కొంటే పైసా వసూల్ అవుతుందో తేల్చుకోవడం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు మార్కెట్లో భారీ బ్యాటరీలు, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్లు, ప్రీమియం సోనీ కెమెరాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న బెస్ట్ 5 స్మార్ట్ఫోన్ల పూర్తి లిస్ట్‌ను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
వన్‌ప్లస్ N6x 5G
* ధర: రూ.18,999 (4GB RAM + 128GB స్టోరేజ్)
Also Read
- 37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
- 200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
* ఎందుకు కొనాలి: ఈ ఫోన్ కీ హైలైట్ ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి పనిచేస్తుంది.
* ప్రత్యేకత: ఫోన్ హీట్ అవ్వకుండా ఇన్‌బిల్ట్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే మిలిటరీ-గ్రేడ్ మన్నిక ఉండటంతో ఎంత రఫ్‌గా వాడినా తట్టుకుంటుంది. బ్యాటరీ లైఫ్, బ్రాండ్ వ్యాల్యూ కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్.
మోటో జి మ్యాక్స్
* ధర: రూ.19,490 ప్రారంభ ధర (ఫ్లిప్‌కార్ట్)
* ఎందుకు కొనాలి: చేతిలో పట్టుకుంటే లగ్జరీ లుక్ ఇచ్చే విలాసవంతమైన ఫినిషింగ్‌తో ఈ ఫోన్ వస్తుంది.
* ప్రత్యేకత: ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో 50MP Sony Lytia 600 కెమెరా సెన్సార్ అందించారు. దీనికి తోడు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉండటంతో డైలీ టాస్క్‌లు స్మూత్‌గా సాగిపోతాయి.
షియోమి రెడ్మి 13 ప్రైమ్ 5G
* ధర: రూ.17,999 (6GB RAM + 128GB స్టోరేజ్)
* ఎందుకు కొనాలి: బిగ్ స్క్రీన్, కంటెంట్ స్ట్రీమింగ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ డీల్.
* ప్రత్యేకత: ఇందులో 6.9-అంగుళాల భారీ డిస్ప్లే తో పాటు సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. రోజంతా నిరంతరాయంగా వీడియోలు చూసేందుకు 6,000mAh బ్యాటరీ, క్రిస్టల్ క్లియర్ పిక్చర్స్ కోసం 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇందులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M17e 5G
* ధర: రూ.19,999 (6GB RAM + 128GB స్టోరేజ్)
* ఎందుకు కొనాలి: ఎలాంటి ప్రయోగాలు లేకుండా నమ్మకమైన బ్రాండ్, లాంగ్ రన్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి శాంసంగ్ ది బెస్ట్ ఆప్షన్.
* ప్రత్యేకత: ఇందులో రోజంతా బ్యాకప్ ఇచ్చేలా 6,000mAh బ్యాటరీ, సహజమైన రంగులతో కూడిన ఫొటోలను అందించే 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది.
ఐకూ Z11 లైట్ 5G
* ధర: రూ.17,499
* ఎందుకు కొనాలి: తక్కువ ధరలో మంచి పవర్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే యూత్‌కి ఇది సరైన మ్యాచ్.
* ప్రత్యేకత: ఇందులో 6,500mAh బ్యాటరీ ఉండటమే కాకుండా, వేగంగా ఛార్జ్ కావడానికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్లో ఇది పైసా వసూల్ మొబైల్.
ఎవరికి ఏది బెస్ట్ అంటే?
మీ ప్రాధాన్యత బ్యాటరీ అయితే వన్‌ప్లస్, ఫొటోగ్రఫీ, డిజైన్ అయితే మోటో, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం రెడ్మి, బ్రాండ్ ట్రస్ట్ కోసం శాంసంగ్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఐకూ మొబైళ్లను మీ అవసరానికి తగినట్లు ఎంచుకోవచ్చు. పండుగ సేల్స్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా వర్తిస్తాయి కాబట్టి కొనేముందు లైవ్ డిస్కౌంట్లను చెక్ చేయడం మర్చిపోవద్దు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
-
SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
-
Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!