మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్‌ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది.
Election Commission: భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్
గోసంరక్షకుల ఆరోపణతో ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న ఘటనలను పరిష్కరించడానికి 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ క్రమంలో.. మాబ్ లించింగ్ ఉదంతాలను పేర్కొంటూ రిట్ పిటిషన్‌కు చాలా రాష్ట్రాలు తమ కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయలేదని తాము గుర్తించామని బెంచ్ ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై రాష్ట్రాలు కనీసం సమాధానం చెప్పాలని బెంచ్ భావించింది. ఇంకా సమాధానం దాఖలు చేయని రాష్ట్రాలకు తాము ఆరు వారాల సమయం ఇస్తున్నామని తెలిపింది.
Off The Record: ఆ ఎమ్మెల్యేను ఆటలో అరటిపండు అనుకుంటున్నారా..?
కాగా.. మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా పోలీస్ డైరెక్టర్ జనరల్‌లకు నోటీసులు జారీ చేసింది. సీపీఐకి చెందిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై వారి స్పందనను కోరింది. విచారణ సందర్భంగా.. పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది నిజాం పాషా మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌లో మూక హత్యల సంఘటన జరిగిందని.. అయితే బాధితులపై గోహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. మూక హత్యల ఘటనను రాష్ట్రం నిరాకరిస్తే.. 2018లో పూనావాలా కేసులో తీర్పును ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గోసంరక్షకుల ఘటనలను అరికట్టేందుకు సుప్రీం కోర్టు రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.