Amit Shah: ప్రధాని పదవి కోసమే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో పొత్తు కాదనుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో చేరారని అన్నారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రి చేయడానికి జేడీయూ అధిష్టానం అంగీకరించిందని ఆరోపించారు అమిత్ షా. బాల్మీకి లోక్ సభ నియోజకవర్గంలో మాట్లాడిన షా, బీహార్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’లోకి నెట్టారని నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. ఆయనకు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేయబడ్డాయని అన్నారు. జయ్ ప్రకాశ్ నారాయణ్ తన జీవితాంతం కాంగ్రెస్, జింగిల్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడారని.. కానీ నితీష్ తన అవసరాల కోసం సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ లతో పొత్తు పెట్టుకున్నారని, ఆయన వికాసవాది కాదని, అవకాశవాది అని అన్నారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Read Also: Dirty Fake Baba: దొంగ బాబా లైంగిక వేధింపులు.. స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు దందా!
‘ఆయా రామ్, గాయరామ్’ చాలు, నితీశ్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కన్నా ఎక్కువ స్థానాలు సాధించిందని, అయితే ప్రధాని మోదీ మరోసారి నితీష్ కుమార్ సీఎం పదవిలో ఉంటారని హామీ ఇచ్చారని, ఆ హామీని కూడా నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. నితీష్, లాలూలు బీహార్ ను వెనుకబాటు తనం నుంచి బయటకు తీసుకురాలేరని, బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. జేడీయూ, ఆర్జేడీ పొత్తు నూనె-నీరు వంటిదని, అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.
బీహార్ సరిహద్దులో జనాభా మార్పును నితీష్ కుమార్ ఆపలేరని, 2024లో నరేంద్రమోదీని మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ గెలిపించండి, అలాంటి ప్రయత్నాలను తిప్పికొడతామని అన్నారు. ఇదిలా ఉంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వీ యాదవ్ ‘మహాగటబంధన్’ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలతో జేడీయూ, ఆర్జేడీ ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. మనల్ని ఎవరు విడదీయలేదరని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!