Nitish Kumar and Tejashwi Yadav: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీ రోల్ పోషించబోతున్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో చంద్రబాబు, నితీశ్ లు కింగ్ మేకర్లుగా మారిపోయారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఈ నేతల మద్దతు కమలం పార్టీకి తప్పనిసరి అయింది. కాగా, ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఈ నేతలు ఇద్దరూ చేరారు. తొలుత ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్.. లాస్ట్ మినిట్ లో ఎన్డీయే గూటికి జంప్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. మిత్రపక్షాలతో కలిసి చర్చించేందుకు రెండు కూటములు మీటింగ్ ఏర్పాటు చేశాయి. అయితే, ఈ సమావేశానికి బీహార్ నుంచి నితీశ్ కుమార్, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ఇవాళ ఢిల్లీకి స్టార్ట్ అయ్యారు.
Read Also: Kalki 2898 AD Trailer: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడంటే?
ఇక, ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్ని రోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ కుమార్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించబోతున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే ఛాన్స్ లేకపోలేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పొత్తులు మార్చుతాడని నితీశ్ కుమార్ కు పేరుంది. కొంత కాలం కిందటి వరకు సహచరులుగా, ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించడం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన కమలం పార్టీ వర్గాల్లో నెలకొన్నట్లు తెలుస్తుంది. ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన వేళ ఈ ప్రయాణం నితీశ్ కుమార్ ను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.