Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు
- న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశానికి డుమ్మా
- పర్యటన రద్దుకు గల కారణాల వెల్లడించని అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన రద్దైంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లేందుకు సిద్ధపడుతున్న తరుణంలో అనూహ్యంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈ పర్యటన ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా చర్చలు జరిగే అవకాశముందని భావించారు. ముఖ్యంగా సభ్య దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యానికి ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ కూటమికి చెందిన కీలక ఆర్థిక సంస్థ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య బహుళపాక్షిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంతటి కీలకమైన పర్యటనను నిరలమ్మ రద్దు చేసుకున్నారు. అయితే నిర్మలా సీతారామన్ పర్యటన రద్దుకు గల కారణాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. పొదుపు మంత్రంలో భాగంగా రద్దు చేసుకుని ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
- Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
- Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
పొదుపు మంత్రం ఆచరణ..
ప్రధాని మోడీ చెప్పినట్లుగానే కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్రాల వరకు పొదుపు మంత్రం ఆచరణలోకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు భారీగా తగ్గిపోయాయి. కేవలం రెండు వాహనాల్లోనే మోడీ ప్రయాణం చేశారు. మూడు వాహనాలతో హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ నడిచింది. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కాన్వాయ్‌లో 11 వాహనాల నుంచి 4కి తగ్గిపోయాయి. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా కేంద్ర పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్ కోసం పౌరులంతా పొదుపు మంత్రం పాటించాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని.. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని.. ఇంధన ఆదా చేయాలని కోరారు. 24 గంటలు గడవక ముందే వడోదరలో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదుపు మంత్రానికి కేంద్రం పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!