Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- హిందూ మతం ఓ జీవన విధానం
- దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువునని నిరూపించుకోవడానికి ఒక దీపం చాలని.. గుడికి వెళ్లనవసరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వ్యక్తి తన ఇంట్లో దీపం వెలిగించినా కూడా అది అతని మతాన్ని నిరూపించడానికి సరిపోతుంది.’’ అని తెలిపారు. ఇక ఆచారాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరాత్న అన్నారు.
హిందూమతం ఒక జీవన విధానమని.. హిందువుగా కొనసాగడానికి గుడికి వెళ్లడం గానీ.. ఏవైనా ఆచారాలు పాటించడం గానీ తప్పనిసరి కాదని.. ఇంట్లో దీపం వెలిగించడం కూడా విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి సరిపోతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళలోని శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ.. ‘‘అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానం అంటారు. హిందువుగా ఉండటానికి గుడికి వెళ్లడం గానీ, ఏవైనా ఆచారాలు పాటించడం గానీ తప్పనిసరి కాదు. ఆచారబద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని, ప్రజలకు విశ్వాసం ఉండటానికి ఏదీ అడ్డురాదు’’ అని జస్టిస్ నాగారత్న అన్నారు.
‘‘ఒక వ్యక్తి తన ఇంట్లో దీపం వెలిగించినా కూడా అది అతని మతాన్ని నిరూపించడానికి సరిపోతుంది.’’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రతి మత ఆచారాన్ని లేదా మతానికి సంబంధించిన విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానంలో ప్రశ్నించడం ప్రారంభిస్తే.. వందలాది పిటిషన్లు దాఖలవుతాయని.. ఇది ప్రతి మతం ‘‘పతనానికి’’ దారితీస్తుందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!