నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమం: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తండ్రి ఎండి జమీల్ అహ్మద్ భావోద్వేగమయ్యారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తండ్రి ఎండి జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. అవార్డుల ప్రధాన వేదికపై మాట్లాడిన జమీల్ అహ్మద్ నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
Also Read : Instagram Love : ఇన్ స్టాగ్రామ్లో లవ్.. యూట్యూబ్ చూసి డెలివరీ
ఒక తండ్రిగా నేను చేసింది కొంతేనని, కేసీఆర్, కవితల సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదని జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. జమీల్ అహ్మద్ ప్రసంగానికి సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నిఖత్ జరీన్ నామినేట్ అయింది.
Also Read : Mahesh Babu: ఓ అన్నా.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా