Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శహకత్వంలో SSMB28 సినిమాలో నటిస్తున్నాడు. ప్రతి సినిమాకు లుక్ మార్చడం మహేష్ కు అలవాటు ఇక బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడంలో మహేష్ తరువాతే ఎవరైనా.. ఆయన వయస్సు 47.. కానీ.. మహేష్ ను చూసిన వారెవరు ఆ మాట అనరు.. అనలేరు. ఎందుకంటే.. ఆయనను చూస్తే.. ఇప్పుడే పాతికేళ్లు నిండాయా అని అనిపిస్తూ ఉంటుంది. నిత్యం జిమ్ లో వర్క్ అవుట్స్,డైట్ తో మహేష్ ఎప్పటికప్పుడు తన వయస్సును తగ్గించుకొంటూ వస్తూనే ఉన్నాడు. తాజాగా మహేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పార్టీలో సూపర్ స్టార్ మహేష్ జంట తళుకున్న మెరిశారు. బ్లాక్ డ్రెస్ కోడ్ అవ్వడంతో మహేష్- నమ్రత బ్లాక్ డ్రెస్ లలో కనిపించారు. ముఖ్యంగా మహేష్ బ్లాక్ టీషర్ట్, గోధమ రంగు ప్యాంట్ తో మ్యాన్లీగా కనిపించాడు. అలా ఆయన కారు దిగుతూ నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయిల గుండెలు జారిపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లైట్ గా గడ్డం.. స్టైలిష్ అవుట్ ఫిట్ తో మహేష్ ఆ ఈవెంట్ కే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఇక ఈ ఫోటోలు బయటికి రావడంతో అభిమానులు.. మహేష్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తున్నారు. అన్నా.. నీకు వయస్సు పెరగడం ఆగిపోయింది అనుకుంటా.. డాక్టర్ కు చూపించుకో అని కొందరు.. ఓ అన్నా.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇదే లుక్ లో బాబు థియేటర్ లోకి వస్తే బాక్సాఫీసులు బద్దలు అవ్వడం ఖాయమని చెప్పుకొస్తున్నారు.