NIKHAT ZAREEN : ప్రపంచబాక్సింగ్ క్వార్టర్స్ లోకి తెలంగాణ అమ్మాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో అదరగొడుతుంది. టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ అమ్మాయి మరో అడుగు ముందుకేసింది. నిన్న జరిగిన 50కేజీల ప్రీక్వార్టర్స్ లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్(మెక్సికో)ను చిత్త చేసింది. ఆరంభం నుంచి పంచ్ పవర్ చూపించిన నిఖత్.. ప్రత్యేర్థికి అవకాశమే ఇవ్వలేదు. మంచి పుట్ వర్క్ కు తోడు లెఫ్ట్, రైట్ హుక్ ల మేళవింపుతో దాడికి దిగిన నిఖత్ జరీన్ ముందు ప్యాట్రిసియా తేలిపోయింది. ప్రతి రౌండ్ లోనూ జడ్జ్ లు నిఖత్ కే ఓటేయడంతో ఆమె ఘన విజయం సాధించింది.
Also Read : Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
Also Read
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
మరోవైపు భారత్ కు చెందిన నీతు గాంగాస్ (48కేజీ), మనీషా (57కేజీ), జాస్మిన్ (60కేజీ) క్వార్టర్ ఫైనల్ చేరారు. ప్రీక్వార్టర్స్ లో సుమైయా ఖోసిమోవా ( తజకిస్తాన్ )ను నీతు నాకౌట్ చేసింది. తొలి రౌండ్ లోనే నీతు పంచ్ లకు సుమైనా నిలవలేకపోవడంతో రిఫరీ బౌట్ ను ఆపేశారు. మరో ప్రిక్వార్టర్సలో నూర్ తుర్హాన్( తుర్కియే)పై మనీషా గెలిచింది. ప్రత్యర్థి బాక్సర్ కంటే పొడగరి అయిన మనీషా పదునైన పంచ్ లతో అటాక్ చేసి విజయాన్ని అందుకుంది. మనీషా దూకుడుకు నూర్ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ మ్యాచ్ ను ఆపి భారత్ బ్యాక్సర్ ను విజేతగా ప్రకటించారు. ఇంకో ప్రీ క్యార్టర్స్ లో సమదోవా( తజకిస్తాన్ )ను జాస్మిన్ ఓడించింది. మరోవైపు శశిచోప్రా(63కేజీ), మంజు(66) టోర్నీ నుంచి నిష్ర్కమించారు. కిటో(జపాన్)చేతిలో శశి.. ఖామిదోవా(ఉబ్బెకిస్తాన్)చేతిలో మంజు చిత్తుగా ఓడిపోయారు.
Also Read : Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..
కాగా, ఆదివారం ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో నిఖత్ తలపడింది. 5-0 ఏకపక్ష స్కోర్ తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ లో గెలిచింది. మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్ లో నిఖత్ కు తన ఆటతీరుతో రెచ్చిపోయింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారింది. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి విజేతగా నిఖత్ జరీన్ నిలిచింది.
తాజావార్తలు
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!