Kajol : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయమే అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించి యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా నిలిచింది. అలాంటి కాజోల్ ఇప్పుడు అజ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇద్దరూ సినిమాల్లో నటిస్తూనే ప్రొడక్షన్ హౌస్ ను కూడా నడిపిస్తున్నారు. కాజోల్ మొదటి నుంచి తాను సంపాదించిన ఆస్తులను రియల్ ఎస్టేట్ మీదనే పెడుతోంది. తాజాగా ఆమె తనకు సంబంధించిన లగ్జరీ ఫ్లాట్ ను అమ్మేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రకటించింది.
Read Also : Rahul Gandhi: బీజేపీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసింది..
ముంబై పోవైలోని హీరానందని గార్డెన్స్ లో కాజోల్ కు ఓ లగ్జరీ ఫ్లాట్ ఉంది. దాదాపు 762 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్ ను ఆమె అమ్మేశారు. దీన్ని రూ.3.1 కోట్లకు రజనీస్ రాణే, విశ్వనాథ్ రాణేలకు అమ్మేశారు. హీరానందని గార్డెన్స్ లో ఉండే అట్లాంటిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 21 అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంటుంది. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. రీసెంట్ గానే ఆమె ఓ ఆఫీస్ స్పేస్ ను కొనుగోలు చేసింది. దాని విలువ రూ.27 కోట్లకు పైమాటే. గతంలో కూడా ఆమె చాలా ఆఫీస్ స్పేస్ బిల్డింగులను కొనేసి అద్దెలకు ఇచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటున్న ఆమె రియల్ ఎస్టేట్ కంపెనీని కూడా రన్ చేస్తోంది.