The bride canceled the wedding because she didn’t like the lehenga: చిన్న చిన్న కారణాలకు పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. ఇరు కుటుంబాలు అనవసర ఈగోలకు పోయి పెళ్లిళ్లు చెడగొట్టుకున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా పెళ్లి బట్టలు నచ్చలేదని చెబుతూ ఏకంగా వధువు తన వివాహాన్ని రద్దు చేసుకుంది. అత్తింటివారు పెట్టిన లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగింది. ఈ ఘటన ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణం అయింది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
Read Also: Shriya Saran: శ్రీయా బాత్ రూమ్ వీడియో వైరల్.. తల్లి అయ్యాక కూడా నగ్నంగా
హల్దానీకి చెందిన యువతికి, అల్మోరాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయం అయింది. నవంబర్ 58న పెళ్లి కావాల్సి ఉంది. ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అబ్బాయి తరుపున పెళ్లి కార్డులు కూడా అచ్చయ్యాయి. పెళ్లి పనుల్లో భాగంగా పెళ్లి కొడుకు తరుపువారు పెళ్లి కూతురు కోసం లక్నో నుంచి ఖరీదైన రూ.10 వేల విలువైన లెహంగాను ఆర్డర్ చేశారు. ఈ లెహంగాను చూసి వధువు తనకు ఇది నచ్చలేదని తెలిపింది. చివరకు పెళ్లి కుమార్తె తల్లి కూడా లెహంగా నచ్చలేదని చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకరించాయి. అక్టోబర్ 30న పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్న అబ్బాయి తరుపు కుటుంబం పెళ్లి రద్దు చేసుకున్నట్లు రూ. 1 లక్ష ఇచ్చారు. దీంతో పాటు రద్దు సమయంలో ప్రూఫ్స్ కోసం వీడియో కూడా తీసుకున్నారు.
ఇదిలా ఉంటే పెళ్లి రద్దైందని అంతా అనుకుంటున్న పక్షంలో అమ్మాయి తరుపు కుటుంబం మళ్లీ యువకుడి ఇంటికి చేరుకుంది. ఎవరు ముందుగా పెళ్లి వద్దనుకున్నారు.. తర్వాత వారే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో విషయం పోలీస్ స్టేషన్ చేరింది. చివరకు పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాలు కూడా పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు నిర్ణయానికి వచ్చాయి.