new type off cyber fraud in instagram
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో అంతే స్థాయిలో చెడుకూడా విస్తరిస్తోంది. టెక్నాలజీని వినియోగించి అమాయకులను ఆసరాగా చేసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఇప్పటికే యువతిలకు ఆన్‌లైన్‌లో వల వేస్తూ.. మోసాలకు పాల్పడుతున్న కేటాగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త తరహా నేరానికి పాల్పడుతున్నారు. ఇన్స్టా గ్రామ్ లో జముండా-అఫిషియల్ పేరుతో ఓ ముఠా పెట్రేగిపోతోంది. ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇన్ట్సాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేసి ఒక వర్గం యువతులను టార్గెట్ చేస్తోంది ఈ ముఠా. రోడ్లపై ఎక్కడైనా యువకుడితో కనిపిస్తే వీడియోలు తీస్తూ ఇన్ట్సాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే.. సదరు మహిళపై అభ్యంతర పోస్ట్‌లు పెట్టడంతో.. తమ కమ్యూనిటీనీ డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ ఇస్తూ పోస్ట్‌లు చేశారు.
జముండా-అఫిషియల్ ఇన్ట్సాలో 12 వేల ఫాల్లోవర్లు ఉన్నారు. రోజు రోజుకు జముండా-అఫిషియల్ పేజ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. మొత్తం 900 మంది యువకులు వీడియోలు తీసే పనిలో ఉన్నారని అడ్మిన్ స్టేటస్ పెట్టాడు. వీరి ఆగడాలు తటుకోలేక పోలీసులు పలువురు ఫిర్యాదులు చేయడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు జముండా-అఫిషియల్ పేజ్ పై 3 కేసులు నమోదు చేశారు. 506, 509 , 354(d) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ట్సా గ్రామ్‌కు హైదరాబద్ పోలీసులు లేఖ రాశారు.