* ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్.
* హైదరాబాద్: నేడు సీబీఐ విచారణకు హజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావాలని 16న నోటీసు ఇచ్చిన సీబీఐ..
* నేడు ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం.. గన్నవరంలో సోమువీర్రాజు అధ్యక్షతన సమావేశం
* నేడు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటనలు.. ఉదయం 10 గంటలకు కొవ్వూరు రూరల్ మండలం వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటారు.. సాయంత్రం 4 గంటలకు కొవ్వూరు క్యాంపు ఆఫీస్ నందు తాళ్లపూడి మండలం వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టి.పి.గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్..
* అనంతపురం : నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్ బీఏ పీర్ కమిటీ పర్యటన. జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించనున్న అధికారులు.
* గుంటూరు: నేడు ప్రత్తిపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం..
* గుంటూరు : నేడు దుగ్గిరాల పసుపు యార్డు వద్ద రైతుల ఆందోళన.. అకాల వర్షాలతో తడిచిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగనున్న రైతులు.
* గుంటూరు: అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా నేడు గుంటూరు సంగడిగుంట విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్న స్థానికులు…
* కాకినాడ: నేడు కాకినాడలో వాలంటీర్ కి వందనం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* బాపట్ల : కొల్లూరు మండలం తాడిగిరిపాడు గ్రామంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.
* అనకాపల్లి జిల్లా: నేడు అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు పర్యటన.. సాయంత్రం రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలోని శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి ఆలయంలో నేడు అమావాస్య పూజలు కూష్మాండ దీపోత్సవం .
* 104వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయా్తర.. ఇప్పటి వరకు 1319.1 కి.మీ. పాదయాత్ర పూర్తి.. నేడు నంద్యాల నియోజకవర్గం రాయపాడు శివార్లలో తటస్థ ప్రముఖులతో ముఖాముఖి., రాయపాడు, బనగానపల్లి నియోజకవర్గంలోని టంగుటూరు, అప్పలాపురం మీదుగా కైప వరకు సాగనున్న పాదయాత్ర.
* తిరుమల: కొనసాగుతోన్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,820 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 36,905 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు
* నేడు వరంగల్ నగరానికి రానున్న రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్..
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు