ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.. ఓ వైపు పోలీసుల పెట్టిన డెడ్‌లైన్ ముంచుకొస్తుంది.. మరోవైపు.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ప్రకాశం జిల్లా మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది..
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. 11 కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో తెగి బైక్ పై పడగానే బైక్ తో పాటు పూర్తిగా ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు.
నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ ప్రాంతవాసుల వరప్రధాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు..
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు…