‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘OG India Tour’: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దేశవ్యాప్తంగా ‘OG ఇండియా టూర్’ పేరుతో భారీ లైవ్ కన్సర్ట్స్ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక మ్యూజికల్ టూర్ ఈ శనివారం హైదరాబాద్‌లో జరిగే భారీ ప్రోగ్రామ్‌తో అత్యంత వైభవంగా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా తమన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ టూర్ గురించి తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఓజీ సినిమా మ్యూజిక్కు వచ్చిన సక్సెస్ సెలబ్రేషన్ కోసమే ఈ ఇండియా టూర్‌ను ప్లాన్ చేశాం. ప్రస్తుతం ఓజీ మ్యూజిక్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే.. సోషల్ మీడియాలో మైకేల్ జాక్సన్ వీడియోలు వచ్చినా, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ సిక్సర్లు కొట్టినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఓజీ మ్యూజిక్‌నే వాడుతున్నారు. అంతలా ఈ ట్యూన్స్ జనాదరణ పొందాయి. ఆ భారీ సక్సెస్‌ను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశం” అని తమన్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆయన సంగీతం అందిస్తున్న లెనిన్ సినిమా గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తమన్. అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ సినిమా గురించి తమన్ మాట్లాడుతూ.. లెనిన్ కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడని అన్నారు. నిజానికి అఖిల్ ది జెన్యూన్ హార్ట్ అని, ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యూజికల్ ఈవెంట్స్ విషయానికి వస్తే హైదరాబాద్‌తో మొదలుకానున్న ఈ ఈవెంట్ టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు పవన్ కల్యాణ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. ఈ శనివారం జరగబోయే లైవ్ కన్సర్ట్‌లో తమన్ అండ్ టీమ్ ఎలాంటి పర్ఫార్మెన్స్తో అదరగొట్టబోతున్నారో వేచి చూడాలి.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఓజీ ఇండియా టూర్ పేరుతో థమన్ లైవ్ కన్సర్ట్స్
ఈ శనివారం హైదరాబాద్ లో ప్రోగ్రాంతో ప్రారంభం
ఓజీ సినిమా మ్యూజిక్ కి వచ్చిన సక్సెస్ సెలబ్రేషన్ కోసం ఈ టూర్ ప్లాన్ చేశా : థమన్
మైకేల్ జాక్సన్ సినిమా వచ్చినా, ఐపీఎల్ లో సిక్సులు కొట్టినా ఓజీ మ్యూజిక్ వాడుతున్నారు
అది సెలబ్రేట్ చేయడం… pic.twitter.com/xyGHD9nx1n
— NTV Breaking News (@NTVJustIn) June 8, 2026
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!