ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మెసేజింగ్ యాప్‌పై ఆధారపడుతున్నారు. కొందరికి వాట్సాప్ లేనిదే రోజు గడవదు. ఈ స్థాయిలో ప్రజల జీవితాల్లో భాగమైంది వాట్సాప్.వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ను తిరిగి యూజర్లకు అందుబాటులోకి రానుంది. చివరిసారిగా వాట్సాప్‌ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్‌సీన్ సెట్టింగ్‌లో అప్‌డేట్‌ను తీసుకురానుంది.
ఈ ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గుడ్ న్యూస్‌తో పాటు మరో బ్యాడ్ న్యూస్ కూడా షేర్ చేసింది వాట్సాప్. త్వరలోనే ఓల్డ్ ఫోన్ యూజర్లకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపి వేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఆండ్రాయిడ్ 4.0.3, అంతకంటే తక్కువ వెర్షన్ పై నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అలాగే ios 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ వెర్షన్ పై పనిచేస్తున్న అన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని ప్రకటించింది.