NTV Telugu Site icon

Covid Variant: వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో అలర్ట్

Covid Variant

Covid Variant

Covid Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌ను అమెరికా, డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. బీఏ.2.86 కొత్త వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ఈ వేరియంట్‌ భారీగా ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నందున నిశితం గమనిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం కరోనా మహమ్మారి గురించి ఓ బులెటిన్‌లో డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Read Also: Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్‌ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన

ఇప్పటివరకు ఈ వేరియంట్ ఇజ్రాయెల్, డెన్మార్క్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే కనుగొనబడగా.. అప్రమతమైన యూఎస్‌ సెంటర్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌(CDC) వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ వేరియంట్‌లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. సాధారణం కరోనా జాగ్రత్తలను పాటిస్తే చాలని WHO తెలిపింది. ఈ వేరియంట్ నాలుగు తెలిసిన సీక్వెన్సులు మాత్రమే ఉన్నాయని.. BA.2.86 ఉత్పరివర్తనాల సంభావ్య ప్రభావం ప్రస్తుతం తెలియదని జాగ్రత్తగా అంచనా వేయబడుతోందని WHO తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో ప్రస్తుతం 10 వేరియంట్‌లను పర్యవేక్షిస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని, దీనిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.