COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 పీడ విరగడయ్యేలా కనిపించడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. BA.2.86 లేదా పిరోలా అనే కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.. అమెరికా, యూకే, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిరోలా వేరియంట్ ఇజ్రాయిల్, కెనడా, డెన్మార్క్,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
New Covid-19 Variant EG.5.1 is now spreading rapidly in UK: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి కేసులు గత ఏడాదికి పైగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కొవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ కేసులు బ్రిటన్‌లో ఎక్కువగా…
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త కొవిడ్-19 వేరియంట్‌ను కనుగొన్నట్లు నివేదించింది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉప-వేరియంట్‌లు ఉన్నాయి.