పసికూన నెదర్లాండ్స్ టీమ్ వన్డేల్లో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడో భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ నమోదు చేసింది. 2023–27 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా గురువారం ఫోర్తిల్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదన రికార్డును ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు రికార్డులు దక్షిణాఫ్రికా పేరిట ఉన్నాయి.
అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 435 లక్ష్యంను దక్షిణాఫ్రికా 9 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. 2016లో డర్బన్‌లో అదే ఆస్ట్రేలియా నిర్ధేశించిన 372 టార్గెట్‌ను ప్రొటీస్ టీమ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. 2025లో డండీలో స్కాట్లాండ్‌పై నెదర్లాండ్స్ 370 లక్ష్యంను మరో నాలుగు బంతులు ఉండగానే ఛేదించింది. ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2013లో జైపూర్‌లో ఆస్ట్రేలియాపై నిర్ధేశించిన 360 టార్గెట్‌ను టీమిండియా (362/1) అందుకుంది. 2019లో బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్ (361)పై ఇంగ్లండ్ (364/4) భారీ లక్ష్య ఛేదన సాధించింది.
Also Read: Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి.. లక్ష దాటేసిన బంగారం ధర!
వన్డేల్లో అత్యధిక రన్ ఛేజ్ చేసిన టాప్ జట్లు:
1. దక్షిణాఫ్రికా: టార్గెట్ – 435, ప్రత్యర్థి – ఆస్ట్రేలియా, సాధించిన స్కోరు – 438/9, సంవత్సరం – 2006, వేదిక – జోహన్నెస్‌బర్గ్
2. దక్షిణాఫ్రికా: టార్గెట్ – 372, ప్రత్యర్థి – ఆస్ట్రేలియా, సాధించిన స్కోరు – 372/6, సంవత్సరం – 2016, వేదిక – డర్బన్
3. నెదర్లాండ్స్: టార్గెట్ – 370, ప్రత్యర్థి – స్కాట్లాండ్, సాధించిన స్కోరు – 373/6, సంవత్సరం – 2025, వేదిక – బెకెన్‌హామ్
4. భారత్: టార్గెట్ – 360, ప్రత్యర్థి – ఆస్ట్రేలియా, సాధించిన స్కోరు – 362/1, సంవత్సరం – 2013, వేదిక – జైపూర్
5. ఇంగ్లండ్ : టార్గెట్ – 361, ప్రత్యర్థి – వెస్టిండీస్, సాధించిన స్కోరు – 364/4, సంవత్సరం – 2019, వేదిక – బ్రిడ్జ్‌టౌన్