కొన్ని రోజుల క్రితం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చి.. కొనుగోలు దారులకు ఊరటిచ్చింది. అయితే ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మరలా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1950 పెరగగా.. 24 క్యారెట్లపై రూ. 2120 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,950గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,400గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,950గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,400గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.93,100గా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,550గా నమోదైంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.
Also Read: Trivikram-Venkatesh: త్రివిక్రమ్‌తో ‘విక్టరీ’ సినిమా.. ఆగస్టులో ఆరంభం!
మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. గత 10 రోజుల్లో వెండి ధర భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగి.. రూ.1,10,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 20 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్ష 10 వేలుగా కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.