విజయనగరం జిల్లాలో రాజకీయంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతోపాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. విశాఖ-విజయనగరం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్. విశాఖకు దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మూడేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్నా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు.…