బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు.. ఆ తర్వాత బయటకు వచ్చాడు..
పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా ఫెమస్ అయ్యాడు.. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవాడు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు. తల్లికి సాయం చేస్తూ ఇల్లు వాకిలి ఊడుస్తున్న ఆ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.అయితే బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ కధ మారిపోయింది. బిగ్ బాస్ గా విన్నర్ అయిన ప్రశాంత్ ఇప్పుడు అతని కి వచ్చిన క్రేజ్ కారణంగా గొప్పగా ఉండాలని అనుకోలేదు.. ఎటువంటి గర్వం లేకుండా మామూలుగానే ఉన్నాడు..
విన్నర్ అవ్వడం అతనికి శాపంగా మారింది..ఇక ముందు అతడు పొలం పనులకే పరిమితం అవుతాడని అందరూ అనుకున్నారు.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు..బిగ్ బాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు,పార్టీలు, ఫంక్షన్లు, టీవీ చానల్స్ ప్రోగ్రాములు ఇలా చాలా హడావిడిగా గడిపాడు. ఇకమీదట పల్లవి ప్రశాంత్ ఇంతకు ముందులాగా రైతుబిడ్డ గా ఉంటాడని ఎవరు ఊహించి ఉండరు. అతను ఒక మామూలు రైతుగానే బ్రతుకుతున్నాడు ఓ ట్రాక్టర్ పై వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..