Nadendla Manohar : రైతుల సంక్షేమం ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యత
- రైతుల బకాయిల చెల్లింపుల్లో ఎన్డీయే సత్వరం
- ధాన్యం సేకరణకు ప్రభుత్వం వేగం పెంచింది
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకు గాను రూ.8,277.59 కోట్లను కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు.
Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..
అదే విధంగా ప్రస్తుత రబీ సీజన్లో 1.16 లక్షల మంది రైతుల నుంచి 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.2,722.81 కోట్లను వెంటనే చెల్లించినట్లు వివరించారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలనే దృష్టితో సత్వర చెల్లింపుల విధానాన్ని పాటిస్తున్నామని చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తీసుకొని పనిచేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Also Read
- AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
- Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
Pakistan: బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
-
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!