ప్రజా మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలు సమావేశం అయింది. ప్రజా మేనిఫెస్టో రూప కల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజా అభిప్రాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయం చెప్పేందుకు ఫోన్ నెంబర్: 8341130393 అందుబాటులో ఉంటుందని ఎన్డీయే కూటమి నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాక్షస పాలను అంతం చేయడమే కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేలు కలిసింది రాక్షసున్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకే అని పేర్కొన్నారు. రామ రాజ్యం కోసం కూటమి ఏర్పడింది.. కూటమికి ప్రజా మద్దతు పెద్ద ఎత్తున ఉంది.. జనం తండోపతండాలుగా వస్తున్నారు అని వర్ల రామయ్య అన్నారు.
Read Also: Siddhu Jonnalagadda: ఎందరో యువ నటులకి ఎన్టీఆర్ నిజంగానే టార్చ్ బేరర్
ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందించడమే ఎన్డీయే కూటమి లక్ష్యం అని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనే.. దుర్యోధన, నరకాసుర పాలనకు చరమగీతం పాడాలి.. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా మేని ఫెస్టోను తయారు చేస్తున్నామన్నారు. ఇక, జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్డీయే కూటమి ఏర్పడిందన్నారు. ప్రజా శ్రేయస్సుకోసం ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామన్నారు.