Siddhu Jonnalagadda Speech at Tillu Square Sucess Meet: టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన మా చిత్ర బృందం మొత్తానికి, అలాగే ఈ సినిమాకి ఆదరించి ఎంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు అని అన్నారు. ఒక ఇద్దరి నేను మాట్లాడాలి, ముందుగా త్రివిక్రమ్. డీజే టిల్లు సినిమాలో త్రివిక్రమ్ ప్రమేయం ఎంత అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఒక స్టూడెంట్ జీవితంలో టీచర్ ప్రమేయం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సినిమా గురించి, జీవితం గురించి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. త్రివిక్రమ్ ని కలవక ముందు వేరే మనిషి, కలిశాక వేరే మనిషిని. జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నా అన్నారు.
Jr NTR: కాలర్ ఎగరేసుకునేలా దేవర.. డైలాగ్ లీక్ చేసిన ఎన్టీఆర్.. సిద్ధూకి హ్యాట్సాఫ్ చెబుతూ!
అలాగే ఇంత బిజీలో ఉండి కూడా, అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి, ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ కి హృదయపూర్వక కృతఙ్ఞతలు. టిల్లు సినిమా చేసిన తర్వాత నీకేమైనా అవార్డులు వచ్చాయా అని చాలామంది అడుగుతూ ఉండేవారు, అప్పుడు అందరికీ తారక్ నా గురించి మాట్లాడిన వీడియో చూపించేవాడిని, నేను చెప్పిన డైలాగ్ తారక్ అన్న నోటి నుంచి రావడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. త్రివిక్రమ్ చెప్పినట్టుగా.. నాకు, విశ్వక్ సేన్ సహా ఎందరో యువ నటులకి ఎన్టీఆర్ నిజంగానే టార్చ్ బేరర్. ఇటీవల కలిసినప్పుడు చిన్న సినిమా గురించి గంట మాట్లాడారు, అది ఆయన గొప్పతనం. అలాగే మాకు దేవర పాటలు కూడా వినిపించారు. దేవర విడుదల సమయంలో తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నా, అప్పుడు మీతో చాలా విషయాలు పంచుకుంటాను. అలాగే ఈ ఈవెంట్ కి వచ్చిన మా గురించి ఇంత బాగా మాట్లాడిన విశ్వక్ సేన్ కి థాంక్స్. టిల్లు క్యూబ్ తో మిమ్మల్ని మరింత అలరిస్తానన్నారు.