Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్‌ను విమర్శిస్తూ నయన్ మూడు పేజీల బహిరంగ లేఖ రాసింది. అయితే ఇప్పుడు ఇదే విషయమై మెగాస్టార్ చిరంజీవి, బాద్ షా షారూఖ్ ఖాన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో తనకు సపోర్ట్‌గా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నయన్ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్‌లో షారుక్‌కి, టాలీవుడ్‌లో చిరంజీవి, రామ్ చరణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన డాక్యుమెంటరీ కోసం ఈ ముగ్గురిని సంప్రదించగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇంతలో, నయనతార పేర్కొన్న దర్శకులు, నిర్మాతలలో షారుఖ్, చిరు, చరణ్, అలాగే తెలుగు, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.
Read Also:Tamil Nadu: చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?
‘‘నేను పనిచేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.. నా సినిమా ప్రయాణం నాకు లెక్కలేనన్ని సంతోషకరమైన క్షణాలను అందించింది. వీటిలో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నిర్మాతలను సంప్రదించినప్పుడు.. వాళ్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు..ధన్యవాదాలు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నటి నయనతార తన డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుష్ ప్రవర్తనపై విమర్శలు చేసింది. ధనుష్ రూ.10కోట్లు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో నానుమ్ రౌడీ డాన్‌కి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్‌లను ఉపయోగించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు ఆమె తెలిపారు. ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంపై ధనుష్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ నయనతార మరోసారి కృతజ్ఞతలు చెప్పడంతో ఇప్పుడు ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Read Also:Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!