Naresh-Pavitra Lokesh : గతంలో కామెడీ హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ గతంలోనే మే నెలలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మే 26న తెలుగు సహా కన్నడలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ డేట్ పై రిలీజ్ డేట్ కనిపించే విధంగా ఓ రొమాంటిక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.
Read Also: Heat Waves: ఎండలేదని ఎంజాయ్ చేస్తున్నారా.. ముందుంది ముసళ్ల పండగ
ఇక ఈ చిత్రంలో జయసుధ, అనన్య నాగళ్ళ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మాణం వహించారు. నటుడు నరేష్ ఈ మధ్య సినిమాల కంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న నరేష్.. ప్రస్తుతం సహనటి పవిత్ర లోకేష్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వీళ్లిద్దరి రిలేషన్‌పై మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ కాంట్రవర్సీ కపుల్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’ . టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగుతోంది.
Read Also: CM YS Jagan: చంద్రబాబు మీకు ముఖం చూపించగలడా? సీఎం ఫైర్
Life Goes in a Full Circle 💞#MalliPelli Releasing in Worldwide Theaters On May 26th ❤️🔥
Lets Start the Celebrations with some crazy updates!🕺#MalliPelliOnMay26 💥@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_… pic.twitter.com/RWJaL0JWkJ
— MS Raju (@MSRajuOfficial) May 3, 2023