Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటితో ఆయన అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగిన ఎలక్టెడ్ ప్రధానిగా మోడీ నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు భారత తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ఆయన రికార్డుని మోడీ తుడిచిపెట్టారు. నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా పదవిలో ఉన్నారు.
అయితే ఇప్పుడు మోడీ అంతకుమించి రికార్డును సెట్ చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా చరిత్ర సృష్టించారు. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.
Also Read
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ఇప్పటివరకు ఈ ఘనత జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952 లో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ 1964 మే 27న మరణించే వరకు 4398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోడీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీ కాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3652 రోజులు, వాజ్ పేయి 2272 రోజులు, పివి నరసింహారావు 1827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.
ఇదిలా ఉంటే మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆయన సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు సన్మానం చేయాలని ఎన్డిఏ పక్షాలు భావిస్తున్నాయి. మోడీ సాధించిన ఈ రికార్డును ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో వరుసగా అధికారంలో కొనసాగుతున్న మోడీ దేశ రాజకీయాలలో అత్యంత ప్రభావశీల నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!