LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG e-KYC: గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన అలర్ట్. మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆఖరి గడువు ముగిసింది. అప్డేట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ బుధవారం, సెప్టెంబర్ 30, 2026 కాగా, అక్టోబర్ 1, 2026 నుంచి బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో తప్పనిసరి చేసింది. ఇండియన్ ఆయిల్ (ఇండేన్), హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. పిఎంయువై (PMUY) పథకం కింద కనెక్షన్ పొందిన వారితో పాటు సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇలా ఆధార్ ఇ-కేవైసీ తప్పనిసరి చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. గ్యాస్ సబ్సిడీని అసలైన, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు గృహ అవసరాల కోసం ఇచ్చే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్, ఇండిస్ట్రియల్ అవసరాల కోసం అక్రమంగా మళ్లించకుండా అడ్డుకట్ట వేయవచ్చని చమురు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం గతంలోనే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. మొదట జూన్ 30, 2026 నాటికి పూర్తి చేయాలని చెప్పగా, ఆ తర్వాత జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7, అలాగే సెప్టెంబర్ 14 వరకు తేదీలను మారుస్తూ చివరకు సెప్టెంబర్ 30ని ఆఖరి అవకాశంగా నిర్ణయించారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 2023 నుంచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా ఎస్ఎమ్ఎస్లు, వాట్సాప్ మెసేజ్‌లు పంపించారు. డెలివరీ బాయ్స్, డిస్ట్రిబ్యూటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి సమాచారం అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించారు. గ్యాస్ బుకింగ్ చేసుకునే సమయంలో ఐవిఆర్ఎస్ కాల్స్, మొబైల్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, పేపర్ ప్రకటనల ద్వారా కూడా వినియోగదారులను నిరంతరం అలర్ట్ చేస్తూనే ఉన్నారు.
Also Read
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
అయితే, ఇప్పటివరకు ఈ ఇ-కేవైసీ పూర్తి చేయని వారికి సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 నాటికి కేవైసీ పూర్తి చేసుకోని వారికి ఇకపై గృహ అవసరాల సిలిండర్లను కూడా వాణిజ్య (కమర్షియల్) రేట్లలో మాత్రమే విక్రయిస్తారని సమాచారం. అంటే మీరు సబ్సిడీని కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశంలో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 942, ముంబైలో రూ. 941.50, కోల్‌కతాలో రూ. 968 మరియు చెన్నైలో రూ. 957.50 గా ఉంది. కాబట్టి గ్యాస్ సబ్సిడీ ఆగకుండా ఉండాలన్నా, సాధారణ ధరలకే సిలిండర్ పొందాలన్నా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి బయోమెట్రిక్ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!