ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్‌లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని…