జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.
బీహార్లోని బెగుసరాయ్ జిల్లా లఖో పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయంలో ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. NH 31 జాతీయ రహదారిపై తీవ్ర గందరగోళం సృష్టించారు.