నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనుకునంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారిన ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం.. అయినప్పటికి వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనుంది.
Also Read: Divya Bharathi : నేను ఎవరితో డేటింగ్‌లో లేను.. కుండ బద్దలు కొట్టిన హీరోయిన్
మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. మూడేళ్ళలో సంగీత్ శోభన్ చేసింది రెండు సినిమాలే. రెండోది కూడా మొదటిదాని సీక్వెల్. నితిన్ నార్నెకు హీరో గా కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ జనంలో బాగా ఫేమ్ సంపాదించుకుంది మాత్రం దామోదర్ అలియాస్ డిడి. నలుగురు కుర్రాళ్ళలో ఒకడిగా తనదైన టైమింగ్ తో అలరించిన తీరు అభిమానులను సంపాదించి పెట్టింది. ఇక అందువలే ఇప్పుడు సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో తెలియాల్సి ఉన్నాయి.