విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు.
మంత్రి నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. సీబీజీ ప్లాంట్ కు భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతు.. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది పౌరుషం, ప్రేమ.. 019లో ఎదురు గాలి ఉన్నా నాలుగు సీట్లు గెలిపించారు.. 2024లో 10 సీట్ల లో గెలిపించారు. ప్రకాశం జిల్లాని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తాం.. అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించాం.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు…
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.