Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వ్యూహం, ప్రజా సమస్యలు, ఎల్‌నినో పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించారు. అనుకున్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకునేలా ప్రతి మంత్రి, ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో పని చేయాలని మంత్రి నారా లోకేష్ సమావేశంలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన తీరును ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం మూడు నిమిషాలైనా గడుపుతూ ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించాలని లోకేష్ మంత్రులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపైనా సమావేశంలో నారా లోకేష్ మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు. ఇటీవల జలాశయాల్లోకి వరద నీరు రావడం కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, నీటి వినియోగంలో జాగ్రత్త అవసరమని అన్నారు. నీటి నిర్వహణలో తొలి ప్రాధాన్యాన్ని తాగునీటి అవసరాలకు, ద్వితీయ ప్రాధాన్యాన్ని పశుగ్రాసం, పశుసంవర్థక అవసరాలకు ఇవ్వాలని లోకేష్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు.
ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనే వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో లోకేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!